భూమి తక్కువ ధరకే అమ్మాలి! ఓ రైతుకు హెడ్‌కానిస్టేబుల్‌ బెదిరింపులు

ధర్మవరం,విధాత‌ : ఆర్థిక ఇబ్బందులతో తన భూమిని అమ్ముకున్న రైతుకు హెడ్‌కానిస్టేబుల్‌ నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. సామాన్యులకు అండగా నిలవాల్సిన పోలీసులే వేధిస్తుండటంతో రైతు అవేదనకు గురవుతున్నాడు. రైతు ఆవేదనకు సంబంధించిన ఆడియో, వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. బాధిత రైతు వెల్లడించిన వివరాల మేరకు.. ధర్మవరం మండలం వెంకటతిమ్మాపురం గ్రామానికి చెందిన మారుతీరెడ్డి అనే రైతు తన ఆర్థిక పరిస్థితులు బాగాలేక మూడున్నరెకరాల భూమి ఎకరా రూ.3.5లక్ష ధరతో విక్రయించారు. ధర్మవరం గ్రామీణ పోలీసు […]

  • Publish Date - July 12, 2021 / 04:19 AM IST

ధర్మవరం,విధాత‌ : ఆర్థిక ఇబ్బందులతో తన భూమిని అమ్ముకున్న రైతుకు హెడ్‌కానిస్టేబుల్‌ నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. సామాన్యులకు అండగా నిలవాల్సిన పోలీసులే వేధిస్తుండటంతో రైతు అవేదనకు గురవుతున్నాడు. రైతు ఆవేదనకు సంబంధించిన ఆడియో, వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. బాధిత రైతు వెల్లడించిన వివరాల మేరకు.. ధర్మవరం మండలం వెంకటతిమ్మాపురం గ్రామానికి చెందిన మారుతీరెడ్డి అనే రైతు తన ఆర్థిక పరిస్థితులు బాగాలేక మూడున్నరెకరాల భూమి ఎకరా రూ.3.5లక్ష ధరతో విక్రయించారు. ధర్మవరం గ్రామీణ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించే హెడ్‌కానిస్టేబుల్‌ పుల్లప్ప బెదిరింపులకు దిగి డబ్బు డిమాండ్‌ చేస్తున్నారని రైతు ఆరోపిస్తున్నారు. ఎకరా రూ.2లక్షలకే విక్రయించాలని, వినకపోవడంతో అప్పులవారిని తన ఇంటిపైకి పంపుతున్నాడన్నారు. వారిని పంపకుండా ఉండేందుకు రూ.30వేలు డిమాండ్‌ చేశాడని రైతు మారుతీరెడ్డి పేర్కొన్నారు. రూ.5వేలు ఫోన్‌పేలో వేశానని, మరో రూ.25వేలు చేతికందించానన్నారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన సమయంలో తనపై పాదరక్షతో దాడికి యత్నించాడని పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ పుల్లప్ప సెల్‌ఫోన్‌లో మాట్లాడిన కాల్‌రికార్డింగ్‌ను ఆదివారం పోలీసు అధికారులకు పంపించినట్లు రైతు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.