విధాత: కుల ధ్రువపత్రం వివాదంపై ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని , శ్రీవాణిని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
పిటిషనర్ తరపు న్యాయవాది బి.శశిభూషణ్ రావు వాదనలు వినిపిస్తూ ‘ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదన్న ఫిర్యాదుపై అప్పీలు విచారణ గిరిజన శాఖ మంత్రి దృష్టికి వచ్చింది కానీ ఆమెనే ఆ శాఖకు మంత్రి. ఆమె కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంలో అప్పీల్ పై ఆమే విచారణ చేయడం చట్ట విరుద్ధం. ఏపీ , ఎస్సీ , ఎస్టీ , బీసీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథార్టీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించండి’ అని కోరారు.