గుంటూరు,విధాత: అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని హోంమంత్రి సుచరిత అన్నారు. శనివారం ఉదయం జశ్వంత్ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదన్నారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ్ముళ్ల కోసం జస్వంత్ నిరంతరం ఆలోచించేవాడని…వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడాతామన్నారు. జస్వంత్ వంటి సైనికుల బలిదానాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని హోంమంత్రి సుచరిత అన్నారు. హోంమంత్రి సుచరితతో పాటు డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్ని…. వీర జవాన్ జస్వంత్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణం బాధాకరం
<p>గుంటూరు,విధాత: అతి చిన్న వయసులోనే వీర జవాన్ జస్వంత్ రెడ్డి మరణించటం బాధాకరమని హోంమంత్రి సుచరిత అన్నారు. శనివారం ఉదయం జశ్వంత్ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత నివాళులర్పించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదన్నారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన ఆ తల్లిదండ్రుల జన్మ చరితార్థమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జస్వంత్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ్ముళ్ల కోసం […]</p>
Latest News

ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ కు హైదరాబాద్ సన్నద్దం
గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ ప్రారంభం..తరలొచ్చిన జనం
సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి