రైతుల ఆర్థిక ప్రయోజనాలు , ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కలిగించేలా మన వ్యయసాయ పద్దతులుండాలననే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమను నిర్ధేశించారు -మంత్రి కన్నబాబు
డా వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం సంకలనం చేసిన ఉద్యాన పంటల పంచాగాన్ని ఆవిష్కరించిన మంత్రి కన్నబాబు.98 ఉద్యాన పంటల సామగ్ర సమాచారంతో రైతులకు సులువుగా అవగాహన కలిగించేలా ఉద్యాన పంటల పంచాంగo రూపొందిచారు.ఉద్యాన పంచాంగ పుస్తకాలు ప్రతి ఆర్ బీ కే లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించిన మంత్రి.
ఉద్యాన సాగులో ఆరోగ్యానికి మరింతగా ఉపకరించే క్రొత్త పంటలు ప్రోత్సాహించాలి.పురుగు మందులు , రసాయనాల వినియోగం తగ్గిస్తూ అధిక దిగుబడి ఇచ్చేలా పరిశోధనలు , ఆవిష్కరణలు జరగాలి.డా వై ఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి ,మన రాష్ట్ర ఉద్యాన పంటల ఉత్పత్తలకు జాతీయ స్థాయిలో ఉన్నత గుర్తిపు వుంది.
డా YSR ఉద్యాన విశ్వవిద్యాలయం , ఉద్యాన శాఖ కలసి సమన్వయంతో పని చేయాలి.డా YSR ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా జానకి రామ్ , వారి శాస్త్రవేత్త లు చేస్తున్న కృషి.అభినందనీయం .ఉద్యాన పంటల సాగుపై నిర్వహిస్తున్న “తోటబడి” శిక్షణా కార్యక్రమాల్లో ఉద్యాన శాస్త్రవేత్తలు మరింత శ్రద్ధ చూపాలి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా పూనమ్ మాల కొండయ్య , అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ , ఉప కులపతి డా జానకి రామ్ ఇతర అధికారులు.