ఐఏఎస్‌ అధికారులు బదిలీ..పోస్టింగులకు ఉత్తర్వులు

విధాత:రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి, వారికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పీ భాస్కర్‌ను కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేసి, సాంకేతిక విద్య డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్‌ అధికారి ఎస్‌ సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా నియమించారు.అలాగే పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న పీ బసంత్‌కుమార్‌ను […]

  • Publish Date - May 29, 2021 / 08:58 AM IST

విధాత:రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి, వారికి పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పీ భాస్కర్‌ను కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేసి, సాంకేతిక విద్య డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఏపీ టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌ను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్‌ అధికారి ఎస్‌ సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా నియమించారు.అలాగే పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న పీ బసంత్‌కుమార్‌ను మున్సిపల్‌ శాఖలో ఎంఐజీ ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించి, ఏపీయూఎ్‌ఫఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.