ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా గిరిజా శంకర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా కోన శశిధర్‌, దేవాదాయశాఖ కమిషనర్‌గా హరిజవహర్‌లాల్‌, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు బదిలీలు, నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జారీ చేశారు.

  • Publish Date - October 2, 2021 / 04:04 AM IST