విధాత: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయన వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కోంది.
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది.
ఐదు రోజులపాటు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ఈనెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతు పవనాలు ఈ నెలాఖరుకు అటు ఇటుగా ప్రవేశించవచ్చని తెలిపింది. ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది