విశాఖపట్నంలో ఐమెరిస్ రూ. 350 కోట్ల రిఫ్రాక్టరీ ప్లాంట్

విశాఖపట్నంలో నూతన కాల్షియం అలుమినేట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ఐమెరిస్ రూ.350 కోట్లు పెట్టుబడిస్థానిక ప్రాంతానికి చెందిన100 మందికి పైగా వ్యక్తుల నియమాకంఫ్రాన్స్ లోని లియన్ నుంచి రిమోట్ గా ఈ ప్లాంట్ ప్రారంభించబడిందిస్పెషాలిటీ కాల్షియం అలుమినేట్ బైండర్స్ పై ప్రధానంగా దృష్టిప్రత్యేకంగా భారతీయ మార్కెట్లలో తిరుగులేని పనితీరు కనబరిచే విధంగా రూపకల్పన విధాత‌ : 2020లో 6.3 బిలియన్ల ఆదాయన్ని పొంది 16,400 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉండి, మినరల్ ఆధారిత స్పెషాలిటీ […]

  • Publish Date - June 24, 2021 / 09:54 AM IST

విశాఖపట్నంలో నూతన కాల్షియం అలుమినేట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ఐమెరిస్ రూ.350 కోట్లు పెట్టుబడి
స్థానిక ప్రాంతానికి చెందిన100 మందికి పైగా వ్యక్తుల నియమాకం
ఫ్రాన్స్ లోని లియన్ నుంచి రిమోట్ గా ఈ ప్లాంట్ ప్రారంభించబడింది
స్పెషాలిటీ కాల్షియం అలుమినేట్ బైండర్స్ పై ప్రధానంగా దృష్టి
ప్రత్యేకంగా భారతీయ మార్కెట్లలో తిరుగులేని పనితీరు కనబరిచే విధంగా రూపకల్పన

విధాత‌ : 2020లో 6.3 బిలియన్ల ఆదాయన్ని పొంది 16,400 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉండి, మినరల్ ఆధారిత స్పెషాలిటీ సొల్యూషన్స్ లో ప్రపంచ అగ్రగామి అయిన ఐమెరిస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం లో తన నూతన కాల్షియం అలుమినేట్ ప్లాంట్ నుంచి వాణిజ్య విక్రయాలను ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఈ గ్రూప్ రూ.350 కోట్లను వెచ్చించింది. ఇది స్థానిక అవసరాలకు తగిన విధంగా ఉత్పాదనలను దేశీయ కొనుగోలుదారులకు అందించేందుకు ఇది కంపెనీకి వీలు కలిగించ నుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిగాపెట్టబడింది. నూతన ప్లాంట్ రిఫ్రాక్టరీని సరఫరా చేయడంతో పాటుగా నిర్మాణరంగ మార్కెట్ కు అవసరమైన కాల్షియం అలుమినేట్ బైండర్ ను సరఫరా చేయనుంది. ఇది సంప్రదాయక క్యాస్టబుల్ వినియోగాల కోసం కంట్రోల్డ్ కెమిస్ట్రీ, ఆప్టిమైజ్డ్ మినరాలజీతో ఉంటుంది. లో– సిమెంట్ క్యాస్టబుల్స్ లో పెరుగుతున్న డిమాండ్ కోసం ప్రత్యేకంగా కాల్షియం అలుమినేట్ బైండర్ని కూడా సంస్థ ఉత్పత్తి చేస్తోంది. భారతీయ రిఫ్రాక్టరీ, నిర్మాణరంగ పరిశ్రమల నిర్దిష్ట అవసరాల కోసం ఈ ఉత్పాదనలు ఐమెరిస్ శాస్త్రవేత్తలచే అభివృద్ధి చేయబడ్డాయి. ఇక్కడి శీతోష్ణస్థితికి అనుగుణంగా తీర్చిదిద్దబడ్డాయి. వేగంగా వృద్ధి చెందుతున్న మౌలికసదుపాయాల రంగానికి సేవలందించేందుకు వ్యర్థజలాలు, టన్నెలింగ్, సివిల్ ఇంజినీరింగ్ లాంటి వాటిలో ఉపయోగించేందుకు వీలుగా దిగుమతి చేసుకోబడిన రెడీ-టు-యూజ్ మోర్టార్స్ మరియు బెంటోనైట్ సొల్యూషన్స్ కు ఈ ప్లాంట్ పంపిణి కేంద్రంగా కూడా పని చేయనుంది. ఈ కేంద్రానికి వైజాగ్ ను ఎంచుకోవడం భారతదేశ ఆగ్నేయ తీరరేఖపై భారతదేశంలోని అతిపెద్ద, బాగా కార్యకలాపాలు కొనసాగే ఓడరేవుల్లో ఒకటైన విశాఖపట్నం రేవును యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిం చింది. ఐమెరిస్ స్థానిక ప్రాంతాలకు చెందిన 100 మందిని రిక్రూట్ చేసుకుంది. ప్లాంట్ పురోగతి చెందుతున్న కొద్దీ వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఐమెరిస్ ఇండియా నేడు 16 పారిశ్రామిక కేంద్రాల్లో, ఎనిమిది విక్రయ కార్యాలయాలను కలిగిఉంది. 800 మంది ఇక్కడ పని చేస్తున్నారు. కాల్షియం అలుమినేట్ బైండర్స్ ఉత్పత్తికి అదనంగా, సిరామిక్స్, ప్లాస్టిక్స్, పాలిమర్స్, రిఫ్రాక్టరీ ఉత్పాదనలను కూడా ఈ గ్రూప్ ఉత్పత్తి చేస్తోంది. ఈ సందర్భంగా ఐమెరిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెగ్జాండ్రో డాజా మాట్లాడుతూ ‘‘ఈ నూతన ప్లాంట్ ను ప్రారంభించడం అనేది ఐమెరిస్ కు ఓ సవాల్ లాంటిది. వృద్ధి చెందుతున్న మార్కెట్లలో, ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడాన్ని ఈ గ్రూప్ కొనసాగించనుంది అనేందుకు ఇదో నిదర్శనం. ఈ తిరుగులేని విజయాన్ని కరోనా మహమ్మారి కారణంగా రిమోట్ గా ప్రారంభిస్తున్నాం. మా స్థానిక బృందాలు ఎంతో గొప్పగా పని చేశాయి అని అన్నారు.