విధాత,అమరావతి : ఇండియన్ ఎయిర్ ఫోర్సులో వివిధ ఉపాధి అవకాశాలపై త్వరలో నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ర్యాలీలకు విస్తృత ప్రచారం కల్పించి యువతను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా 12 ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాదు కమాండింగ్ అధికారి వింగ్ కమాండర్ ఎస్.శ్రీచైతన్య నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. ఈసందర్భంగా ఇంటర్మీడియట్ అనంతరం ఎయిర్ ఫోర్సులో చేరేందుకు గల వివిధ అవకాశాలపై వారు సిఎస్‌తో చర్చించారు. ఇందుకు సంబంధించి త్వరలో రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో ఎయిర్ మెన్ సెలకక్షన్ కు సంబంధించిన ర్యాలీలను నిర్వహించనున్నామని అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని వింగ్ కమాండర్ చైతన్య సిఎస్‌కు విజ్ణప్తి చేశారు. దానిపై సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ త్వరలో చేపట్టనున్న ఎయిర్ మెన్ సెలక్షన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విస్తృత ప్రచారం కల్పించి అధిక సంఖ్యలో యువత ఎయిర్ ఫోర్సులో చేరేలా కృషి చేస్తామని న్నారు. వివిధ జిల్లాల కలక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేయడంతో పాటు కళాశాల, ఉన్నత విద్యాశాఖల కార్యదర్శులకు కూడా తగిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. సమావేశంలో 12 ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్సులో.. ఉపాధి అవకాశాలపై త్వరలో రిక్రూట్మెంట్ ర్యాలీలు
<p>విధాత,అమరావతి : ఇండియన్ ఎయిర్ ఫోర్సులో వివిధ ఉపాధి అవకాశాలపై త్వరలో నిర్వహించనున్న రిక్రూట్మెంట్ ర్యాలీలకు విస్తృత ప్రచారం కల్పించి యువతను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా 12 ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాదు కమాండింగ్ అధికారి వింగ్ కమాండర్ ఎస్.శ్రీచైతన్య నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. ఈసందర్భంగా ఇంటర్మీడియట్ అనంతరం ఎయిర్ ఫోర్సులో చేరేందుకు గల […]</p>
Latest News

కరోనా టైంలో చనిపోతానని అనుకున్నా..
శారీలో సీరియల్ బ్యూటీ అందాలు.. ప్రియాంక జైన్ క్యూట్ ఫోటోలు
దావోస్‌లో కలుసుకున్న రేవంత్, చిరు..
భారీగా పెరిగిన బంగారం ధరలు..నిలకడగా వెండి
ట్రెడిషనల్ వేర్ లో ట్రెండీ లుక్స్.. శోభిత క్యూట్ ఫొటోలు
మూగజీవాల కోసం పోరాటం..
ఖాతాదారులకు అలర్ట్.. బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు..!
స్మృతి మాజీ లవర్ దర్శకత్వంలో కొత్త సినిమా..
స్నానంతోనూ డబ్బు సంపాదించొచ్చు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!