హెచ్‌పీసీఎల్‌ ఘటనపై ఐదుగురు సభ్యుల కమిటీతో విచారణ

విధాత,విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం ఐదుగురు సభ్యుల సాంకేతిక కమిటీతో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ విచారణకు ఆదేశించారు. సీడీయూ-3లో ప్రమాదం, ఆయిల్ లీక్‌కు గల కారణాలపై ఈ కమిటీ విశ్లేషించనుంది. అలానే ఐఐపీఎం,ఆంధ్రా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ నిపుణులుతో సాంకేతిక, భద్రతా పరమైన విచారణ జరిపించనున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందుతుందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. […]

  • Publish Date - May 26, 2021 / 03:46 PM IST

విధాత,విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం ఐదుగురు సభ్యుల సాంకేతిక కమిటీతో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ విచారణకు ఆదేశించారు. సీడీయూ-3లో ప్రమాదం, ఆయిల్ లీక్‌కు గల కారణాలపై ఈ కమిటీ విశ్లేషించనుంది.

అలానే ఐఐపీఎం,ఆంధ్రా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ నిపుణులుతో సాంకేతిక, భద్రతా పరమైన విచారణ జరిపించనున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందుతుందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. 45నిముషాలు వ్యవధిలోనే మంటలను అదుపు చేయగలిగాము…సీడీయూ-3తప్ప మిగిలిన అన్ని యూనిట్లలోనూ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతోందని కలెక్టర్‌ తెలిపారు.