విధాత: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా హిందూ మత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనల ప్రసారంపై ఈవో దృష్టి సారించారు. ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా జరిందా? లేక పొరపాటున జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఈడీ ప్రొజెక్టర్‌లో క్రైస్తవ ప్రార్థనలు ప్రసారంపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమ్మవారి భక్తులతో కలిసి దుర్గ గుడి ఈవోని కలిసి దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఈవో.. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.