ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు

ముఖ్యమంత్రి జగన్ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టడం మాని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు.అకారణంగా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బిసి జనార్థన్ రెడ్డితోపాటు తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.అధికారం శాశ్వతం కాదనే […]

  • Publish Date - May 24, 2021 / 04:31 AM IST

ముఖ్యమంత్రి జగన్ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టడం మాని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు.అకారణంగా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ నాయకులు, బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బిసి జనార్థన్ రెడ్డితోపాటు తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలి. కరోనాను నియంత్రించేదానికన్నా ప్రతిపక్షాలను నియంత్రించడమే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారు.రాష్ట్రంలో వైసీపీ పాలన తీరు మూడు అక్రమ కేసులు ఆరు అరాచకాలు అన్నట్లుగా సాగుతోంది.

దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలను వదలిపెట్టి దాడిని అడ్డుకున్న జనార్థనరెడ్డిని అరెస్టు చేయడం రాజారెడ్డి రాజ్యాంగం కాదా?వివాదాలకు దూరంగా ఉండే బీసీ జనార్దన్ రెడ్డి లక్ష్యంగా అక్రమ కేసులతో వేధిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలి.

Latest News