నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

యువతను దగా చేసిన జగన్ ప్రభుత్వంతగిన గుణపాఠం చెబుతాం తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ విధాత:రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఏపీపీఎస్సీ ద్వారా అన్ని రకాల ఉద్యోగాలను ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని పాదయాత్రలో హామీలు ఇచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి యువతను నిండా మోసం చేశారని నిరుద్యోగ యువతకు జగన్మోహన్రెడ్డి క్షమాపణలు చెప్పాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు […]

  • Publish Date - June 7, 2021 / 05:27 AM IST

యువతను దగా చేసిన జగన్ ప్రభుత్వం
తగిన గుణపాఠం చెబుతాం

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్

విధాత:రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఏపీపీఎస్సీ ద్వారా అన్ని రకాల ఉద్యోగాలను ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని పాదయాత్రలో హామీలు ఇచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి యువతను నిండా మోసం చేశారని నిరుద్యోగ యువతకు జగన్మోహన్రెడ్డి క్షమాపణలు చెప్పాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు పెద్దపీట ఇస్తానని చెప్పి కింద కత్తిపీట పెట్టాడని రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ నోటిఫికేషన్ లు పేపర్ ప్రకటన ఇస్తే పరిమితమయ్యాయి.

యువతను దగా చేసిన జగన్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువత సరైన గుణపాఠం చెప్తారని మెగా డీఎస్సీ నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం దాని ఊసే లేకుండా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగ యువతను దగా చేసిన జగన్ ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత రాబోయే రోజుల్లో గద్దె దింపడం ఖాయమని ఆయన అన్నారు నిరుద్యోగ యువత తరపున ప్రభుత్వంపై పోరాడడానికి తెలుగు యువత సిద్ధంగా ఉందని దున్నపోతు ప్రభుత్వాన్ని కదిలించినా నిరుద్యోగ యువతకు న్యాయం చేసే విధంగా నోటిఫికేషన్లు సాధిస్తామని రాష్ట్రంలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాలు కలిపి సంఘటిత ఉద్యమాలు చేస్తామని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్ తెలియజేశారు.