అమ్మవారిని మోసం చేయొద్దు

విధాత: అమ్మవారిని మోసం చేయవద్దని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు ఈ రోజున ఆర్థికశాఖ ఆమోదించిందని పత్రికల్లో వచ్చిందని, అంటే అమ్మవారి ఆలయం ఖాతాకు జమ కానట్లేగా? అని ప్రశ్నించారు. నిన్నటి వరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ప్రచారం అబద్ధమేగా? అని నిలదీశారు. ఆర్థికశాఖ ఆమోదానికి ఏడాది సమయం పడితే నిధులు విడుదలకు ఈ ప్రభుత్వ హయాంలో అయ్యేపనేనా యెద్దేవా చేశారు. ఈరోజు […]

  • Publish Date - October 13, 2021 / 04:36 AM IST

విధాత: అమ్మవారిని మోసం చేయవద్దని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు ఈ రోజున ఆర్థికశాఖ ఆమోదించిందని పత్రికల్లో వచ్చిందని, అంటే అమ్మవారి ఆలయం ఖాతాకు జమ కానట్లేగా? అని ప్రశ్నించారు. నిన్నటి వరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ప్రచారం అబద్ధమేగా? అని నిలదీశారు. ఆర్థికశాఖ ఆమోదానికి ఏడాది సమయం పడితే నిధులు విడుదలకు ఈ ప్రభుత్వ హయాంలో అయ్యేపనేనా యెద్దేవా చేశారు. ఈరోజు పట్టువస్త్రాలు సమర్పించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి ఆర్థికశాఖ ఆమోదమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం పర్యటన గత ఏడాదిలా ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరగాలని కోరుకుంటున్నానని పోతిన మహేష్ అన్నారు.