విద్యుత్ విష‌యంలో ప్రభుత్వం ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తోంది

విధాత‌: విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. దేశమంతా విద్యుత్ కొరతలున్నాయంటూ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. జగన్‌రెడ్డి భార్య భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం కృత్రిమ విద్యుత్ కొరత సృష్టిస్తోందన్నారు. సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్‌కు రూ.4,500 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి చెల్లించాలని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.12వేల కోట్ల భారం వేసిందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌పై తక్షణమే […]

  • Publish Date - October 18, 2021 / 11:04 AM IST

విధాత‌: విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. దేశమంతా విద్యుత్ కొరతలున్నాయంటూ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. జగన్‌రెడ్డి భార్య భారతి నిర్వహణలో ఉన్న సండూర్ పవర్ నుంచి విద్యుత్ కొనడానికే ప్రభుత్వం కృత్రిమ విద్యుత్ కొరత సృష్టిస్తోందన్నారు. సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్‌కు రూ.4,500 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి చెల్లించాలని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.12వేల కోట్ల భారం వేసిందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌పై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.