Road Accident | విధాత : చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..ఇద్దరు యువతులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ మారింది.
రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరు యువతులపైకి అదుపు తప్పిన లారీ దూసుకొచ్చింది. రెప్పపాటులో దానిని గమనించిన యువతులు రోడ్డు పక్కకు పరుగెత్తారు. వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో గౌతమ్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ఆర్టీసీ కూడలిలో బైపాస్ రహదారి వద్ద ఫ్లైఓవర్ పై నుంచి లారీ అతివేగంగా దూసుకొచ్చింది. బైక్‌పై వస్తున్న యువకులను ఢీకొడుతూ వెళ్లి ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో యువకులు రెండు వాహనాల మధ్య చిక్కుకుపోగా.. గౌతమ్ అనే వ్యక్తి చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఈ ప్రమాదంలో యువతులు ఇద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకోవడం చూస్తే..వారు నిజంగా అదృష్టవంతులేనని..వారి ఆయుష్షు గట్టిదని అందుకే ప్రమాదం నుంచి క్షణ కాలంలో బయటపడ్డారని నెటిజన్లు కామెంట్ చేశారు.
