Oscars 2026 | ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ అవార్డ్స్ ముందుంటుంది. సినిమా రంగానికి చెందిన ప్రతి నటుడు, దర్శకుడు, టెక్నీషియన్ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అందుకోవాలని కల కంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ 2026 కార్యక్రమం ఈసారి కూడా అట్టహాసంగా ప్రారంభమైంది.
భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 16) తెల్లవారుజామున అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఉన్న డాల్బీ థియేటర్‌లో 98వ అకాడమీ అవార్డ్స్ వేడుక ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాల్లో వివిధ విభాగాల్లో సత్తా చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ వేడుకలో అవార్డులు అందజేస్తున్నారు.
ఇప్పటికే ప్రకటించిన విజేతలు
ఆస్కార్స్ 2026 వేడుకలో ఇప్పటికే కొన్ని విభాగాల్లో విజేతలను ప్రకటించారు.
ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ – వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ సహాయ నటి: అమీ మాడిగన్ – వెపన్స్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్, క్లియోనా – ఫ్రాంకెన్‌స్టైన్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: డిజూన్ కేట్ హాలే – ఫ్రాంకెన్‌స్టైన్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కే-పాప్ డీమన్ హంటర్స్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవా
ఈసారి టెక్నికల్ విభాగాల్లో కూడా పలు చిత్రాలు తమ ప్రతిభను చాటుకుంటూ అవార్డులను కైవసం చేసుకున్నాయి.
ఈసారి కొత్త విభాగం
సాధారణంగా ఆస్కార్ అవార్డులను ప్రతి ఏడాది 23 విభాగాల్లో ప్రకటిస్తారు. అయితే ఈసారి కొత్తగా “బెస్ట్ కాస్టింగ్” అనే విభాగాన్ని ప్రవేశపెట్టడంతో మొత్తం 24 విభాగాల్లో అవార్డులను అందిస్తున్నారు. 2025 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతోంది.
బెస్ట్ యాక్టర్ అవార్డుపై ఉత్కంఠ
సినిమా రంగంలో అత్యంత గౌరవంగా భావించే బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం ఈసారి గట్టి పోటీ నెలకొంది. ఈ విభాగంలో నామినేట్ అయిన నటులు వీరే:
తిమోతీ చలామెట్ – మార్టి సుప్రీం
లియోనార్డో డికాప్రియో – వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఏతాన్ హాక్ – బ్లూ మూన్
మైఖేల్ బి. జోర్డాన్ – సిన్నర్స్
వాగ్నర్ మౌరా – ది సీక్రెట్ ఏజెంట్
ఉత్తమ నటి నామినేషన్లు:
అలాగే బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో కూడా గట్టి పోటీ నెలకొంది. ఈ అవార్డు కోసం నామినేట్ అయిన నటీమణులు:
జెస్సీ బక్లీ – హామ్నెట్
రోజ్ బైర్న్ – ఇఫ్ ఐ హావ్ లెగ్స్ ఐ హాడ్ కిక్ యు
కేట్ హడ్సన్ – సాంగ్ బ్లూ
రెనేట్ రీన్స్వ్ – సెంటిమెంటల్ వాల్యూ
ఎమ్మా స్టోన్ – బుగోనియా
మొత్తానికి ప్రపంచ సినీ పరిశ్రమ దృష్టి మొత్తం ప్రస్తుతం ఆస్కార్స్ 2026 వేడుకపై నిలిచింది. ఇంకా ప్రకటించాల్సిన ప్రధాన విభాగాల ఫలితాల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
