విధాత: వైసీపీ నేత వేధింపులపై సీఎం జగన్‌కు మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియో. నాదెండ్ల ఎంపీటీసీ గుడికందుల యల్లారావు వేధింపుల నుంచి కాపాడాలని వేడుకోలు. దళిత కుటుంబానికి చెందిన తాను వాలెంటీర్‌గా పనిచేస్తూ డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని,ప్రియురాలి కుమార్తెను వాలెంటీర్ గా పెట్టాలని నన్ను ఎంపీటీసీ వేధింపులకు గురిచేస్తున్నాడని,ఎంపీటీసీ నుంచి తనను కాపాడాలని వాలెంటీర్ చెవుల యామిని సెల్ఫీ వీడియో సీఎం జగన్ కు పంపింది.