గుట్టలుగా శవాలంటూ..తప్పుడు రాతలు

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు ప్రెస్‌మీట్‌: కోవిడ్‌ను అడ్డం పెట్టుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు గుట్టలుగా శవాలంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.మరణాలను దాచేస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నాయి.స్మశాన రిపోర్టింగ్‌ స్థాయికి దిగజారిన రెండు పత్రికలు.కోవిడ్‌ పై నిత్యం బులిటెన్‌ విడుదల చేస్తున్నాం.వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టీకరణ.చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా రాద్దాంతం.సీఎం జగన్‌ గారిపై ద్వేషంతోనే బురదచల్లుతున్నాయి.బాధ్యతారాహిత్యంతో ఎల్లో మీడియా పని చేస్తోంది […]

  • Publish Date - April 23, 2021 / 05:03 AM IST

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్‌మీట్‌:

కోవిడ్‌ను అడ్డం పెట్టుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు గుట్టలుగా శవాలంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.మరణాలను దాచేస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నాయి.స్మశాన రిపోర్టింగ్‌ స్థాయికి దిగజారిన రెండు పత్రికలు.కోవిడ్‌ పై నిత్యం బులిటెన్‌ విడుదల చేస్తున్నాం.వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టీకరణ.చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా రాద్దాంతం.సీఎం జగన్‌ గారిపై ద్వేషంతోనే బురదచల్లుతున్నాయి.బాధ్యతారాహిత్యంతో ఎల్లో మీడియా పని చేస్తోంది
మాది రైతు పక్షపాత ప్రభుత్వం.రైతులు, వ్యవసాయం, పంటలపై సీఎం నిరంతర సమీక్షలు
పంటల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.ఎల్లో మీడియా రైతులను ఆందోళనకు గురి చేసేలా వార్తలు రాస్తోంది.రైతులను భయపెట్టడం ద్వారా ఎల్లో మీడియా ఏం సాధిస్తుంది?ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన మంత్రి కె.కన్నబాబు.

మంత్రి కె.కన్నబాబు ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌:

– ప్రతి 10 లక్షల జనాభాలో అత్యధికంగా కోవిడ్‌ పరీక్షలు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే గుర్తింపు ఉంది. దీనికి కారణం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సంకల్పం. ప్రతిరోజూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, ప్రజలకు ఉత్తమ సేవలు అందించే దిశగా ఆయన నడిపిస్తున్నారు.

– ఈ రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్ష తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. కరోనాను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తున్నాయి. తప్పుడు రాతలతో ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మీడియా సంస్థలకు సామాజిక బాధ్యత ముఖ్యం. కరోనా వంటి సంక్షోభ సమయంలో మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాలి.

– కరోనా రెండో వేవ్‌ ప్రారంభంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పూర్తి స్థాయి చర్యలను తీసుకోవడంలో నిమగ్నమైంది. ఈ సమయంలో రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని తన వార్తలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి కంకణం కట్టుకున్నాయి.

– గుంటూరు బొంగరాలబీడు అనే శ్మశానం నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్‌ రిపోర్ట్‌ చేశాయి. శ్మశానాల్లో గుట్టలు, గుట్టలుగా శవాలు.. నాలుగు రోజుల్లో 130కి పైగా కరోనా మృతులకు అంత్యక్రియలు అంటూ రెండు పత్రికలు కూడబలుక్కుని వార్తలు రాశాయి. ఈ రెండు పత్రికలు చివరికి శ్మశాన రిపోర్టింగ్‌ చేసే స్థాయికి దిగజారిపోయాయి. ఇక ఈనాడు అయితే కాష్టం కష్టం అని, కోవిడ్‌∙కల్లోలమే దీనికి కారణంగా పేర్కొంటూ వార్తలు రాసిది. కోవిడ్‌ మరణాలకు సంబంధించిన నివేదికల్లో ప్రభుత్వం గుండెపోటుగా నిర్థారణ చేసి, సంఖ్యను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించడానికి సామాజిక బాధ్యత లేకపోవడమే కారణం.

– ఈనాడు, ఆంధ్రజ్యోతి దిగజారిపోయి చేసిన రిపోర్టింగ్‌ చదవిన వారు రాష్ట్రంలో ఏదో జరుగుతోందని వణికిపోయేలా తమ వార్తా కథనాలను వండి వార్చారు. మీ ఇష్టం వచ్చినట్లు వక్రీకరించడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఈ ప్రభుత్వం ప్రతిరోజూ కోవిడ్‌ పై బులిటెన్‌ విడుదల చేస్తోంది. నిత్యం ఎన్ని పరీక్షలు చేస్తున్నాం? ఎంతమంది మరణించారు? ఎంత మంది డిశ్చార్చ్‌ అయ్యారో పూర్తి వివరాలను అందిస్తోంది. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం కోవిడ్‌ విషయంలో వ్యవహరిస్తోంటే.. కనీస బాధ్యత లేకుండా ఎల్లో మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలును ఎలా ప్రచురిస్తున్నాయి?

– టిడిపి అధికారంలో లేకపోవడం వల్ల ఈ రాష్ట్రం కల్లోలితంగా మారిందని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చిత్రీకరిస్తారా? ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి మీరు కరోనాను ఒక ఎజెండాగా పెట్టుకుంటారా? చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపడం, అంతర్జాతీయ నాయకుడిగా కీర్తించడం, లోకేష్‌ యువ నాయకుడిగా భజన చేయడం ఈనాడు, ఆంధ్రజ్యోతికి అలవాటుగా మారింది. మధ్యలో ప్రజలను ఎందుకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు?

– ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎప్పుడు ఒక ఎజెండా కావాలి. చంద్రబాబును కీర్తించడం, ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా విమర్శించడం వాటి పని. వార్తలు రాసే ముందు కనీసం నిజాలను నిర్థారించుకోవాలనే విషయాన్నే విస్మరించాయి.

– నేషనల్‌ మీడియా కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో మీడియా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చాలా స్పష్టంగా చెప్పాయి. కరోనా అనేది ఒక జాతీయ విపత్తు. ఇటువంటి సమయంలో అందరూ బాధ్యతతో వ్యవహరించాలి. అంతే కానీ సామాజిక బాధ్యత లేకుండా శ్మశానంలోని శవాలను చూసి సంతోషించే కార్యక్రమంకు ఎల్లో మీడియా పూనుకోవడం వారి పక్షపాతానికి పరాకాష్ట.

– కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల ఏర్పడే పరిణామాలపై ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చించింది. పలు నిర్ణయాలు తీసుకుంది. రేపు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కూడా సబ్‌ కమిటీ సూచనలపై సమీక్షిస్తారు. ఇప్పటికే కోవిడ్‌ నివారణకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. జిల్లాల వారీగా కమిటీలు వేశాం. కలెక్టర్‌ల వద్ద అత్యవసర నిధులను అందుబాటులో ఉంచాం. ఇలా అన్ని చర్యలు తీసుకుంటునాం. ఇది ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?

– ఈనాడు రైతులను భయబ్రాంతులకు గురి చేసేందుకు ‘శ్రమఫలంపై చేదు వైరస్‌’ అంటూ మరో అసత్య కథనాన్ని ప్రచురించింది. ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. నిరంతరం సమీక్షిస్తున్న రంగాల్లో వ్యవసాయం అగ్రస్థానంలో వుంది. విత్తనం నుంచి విక్రయం వరకు అంటూ రైతును అన్ని విధాలుగా ఆదుకునేందుకు సీఎం నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు.

– ఈరోజు ఈనాడులో మిర్చి, మామిడి, బత్తాయి ధర పడిపోయిందని కథనం రాశారు. ఈ కథనంలో కనీస వాస్తవాలను కూడా పట్టించుకోకుండా అసత్యాలు రాశారు. గుంటూరు మిర్చి యార్డ్‌లో 4 లక్షల టిక్కీలు మిర్చి నిల్వ 20 నాటికి వుంది. ఈలోగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం వున్న నిల్వ అమ్ముడు పోయే వరకు, కొత్త సరుకు తీసుకురావద్దని రైతులకు విజ్ఞప్తి చేశాం. ఈనెల 26 నుంచి కొత్త మిర్చి నిల్వలకు అనుమతులు ఇస్తామని స్పష్టంగా ప్రకటించాం. గత ఏడాదిలో మాదిరిగా కోల్డ్‌ స్టోరేజీల్లో రైతులు తమ పంటను నిల్వ చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

– మిర్చి క్వింటా మొన్నటి వరకు రూ.15,400 వుంటే, ఇప్పుడు రూ.15,000 వుంది. ఇదే పంట గత ఏడాది కింటా రూ.11 వేల నుంచి 12 వేల ధర మాత్రమే పలికింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ ధర వుంది. కనీస మద్దతు ధర రూ.7 వేలు మాత్రమే వుంటే, దానికి రెట్టింపు ధర ఇప్పుడు మిర్చీకి లభిస్తోంది. అలాంటిది మిర్చి ధర పతనం అంటూ ఈనాడు దేని ఆధారంగా వార్తలు రాసింది? మీ తప్పుడు రాతలు చూసి రైతులు ఆందోళన చెందాలని, దానిని అవకాశంగా తీసుకుని దళారులు, వ్యాపారులు రైతులను దోచుకోవాలని ఈనాడు భావిస్తోందా?

– ఇక మామిడి ధర పడిపోయిందని ఈనాడు రాసిన మరో కథనం. అసలు ఏ ప్రాతిపాదికన ఆ కధ రాశారు? ఏటా సీజన్‌ ప్రారంభంలో మామిడికి ఎక్కువ ధర ఉంటుంది. దిగుబడి ఎక్కువగా మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ధరలు స్థిరపడతాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గింది. గత ఏడాది లాక్‌డౌన్‌ వల్ల మార్కెట్లు మూతపడ్డాయి. పంట∙అమ్ముకునే వీలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. ధరలు కూడా తగ్గాయి. ఈ ఏడాది అటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అన్ని మార్కెట్లు నడుస్తూనే వున్నాయి. మామిడి ఎగుమతులకు కూడా ఆటంకాలు లేవు. అటువంటి సందర్భంలో మామిడి ధర పతనం అంటూ ఎలా రాస్తారు?

– బత్తాయి టన్ను రూ.50 వేలు వుందని ఈనాడులో కథనం రాశారు. ప్రభుత్వం బత్తాయికి ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.14 వేలు. దాని కన్నా చాలా ఎక్కువగానే మార్కెట్‌లో రేటు పలుకుతోంది. దీనిని ధర పతనం అని ఎలా అంటారు? గత కొద్ది సంవత్సరాలుగా ధరలు తీసుకుంటే, బత్తాయికి అత్యధిక రేటు వస్తున్న సీజన్‌ ఇదే.

– ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలన్నదే నిరంతర లక్ష్యం. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పై ద్వేషం వుంది. దానిని తీర్చుకోవడానికి కరోనా సంక్షోభ సమయంలో అసత్యాలతో కూడిన వార్తలు రాసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తారా?

– ఈ ఏడాది మార్కెట్‌ ఇంట్రవెన్షన్‌ తీసుకుంటే కందులు, పెసలు, మినుములు, శనగలు, వేరుశనగ, కాటన్, మిర్చి, ఉల్లి, బత్తాయి, పసుపు ఎంఎస్‌పి కంటే ఎక్కువ రేట్లు పలుకుతున్నాయి. మొక్కజొన్నను మార్క్‌ఫైడ్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాం. జొన్న కూడా గ్రేడేడ్‌ ఎంఎస్‌పి పెట్టి కొనుగోలు చేస్తున్నాం. ధాన్యంను సివిల్‌ సప్లయిస్‌ కొనుగోలు చేస్తోంది. ఏ పంటను గాలికి వదిలేసిది ఈ ప్రభుత్వం?

– సీఎంగారు ప్రతి రివ్యూలోనూ ప్రతి గ్రామంలో, రైతుభరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించి, రైతు స్థానికంగానే తమ పంటను అమ్ముకునేలా చేయాలని ఆదేశించారు. తమ పంట మార్కెట్‌లకే తీసుకురావాలనే ఖచ్చితమైన పరిస్థితి వుండకూడదని సీఎం గారు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశారు.

– టిడిపి హయాంలో పంటలను రూ.3557 కోట్లతో 8,50,823 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తే, జగన్‌గారు సీఎంగా రెండేళ్ళలోనే రూ.5550 కోట్లతో 15,11,811 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలుకు రూ.18 వేల కోట్లు ఖర్చు చేశారు. అయిదేళ్ళలో టిడిపి వ్యవసాయ పంటల కొనుగోలుకు చేసిన దానికన్నా రెండేళ్ళలో ఈ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసింది. అటువంటి ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి.

– కేంద్రం 23 పంటలకే ఎంఎస్‌పి ప్రకటిస్తే, మిర్చి, పసుపు, ఉల్లి, అరటి, బత్తాయి, చిరుధాన్యాలకు సీఎం శ్రీవైయస్‌ జగన్‌ ఎంఎస్‌పి ప్రకటించారు.

– గత ఏడాది కోవిడ్‌ సందర్భంగా ప్రతిరోజూ అన్ని అంశాలపైనా సీఎం జగన్‌గారు సమీక్షించారు. నేడు రెండో వేవ్‌ సందర్భంగా కూడా నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్‌ పెంచడం, పరీక్షలు ఎక్కువగా చేయడం, మందులు అందుబాటులో వుంచడం, ఆక్సీజన్‌ సరఫరా, రెమిడెసివీర్‌ కొరత లేకుండా చూడటం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగా గుట్టలు గుట్టలుగా శవాలు అంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. మరణాల సంఖ్యను దాచాల్సిన అవసరం ఈ ప్రభుత్వానిక లేదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వార్తలు రాయడం తగదు.

– వయస్సు మళ్ళిన చంద్రబాబు, పిల్లవాడైన లోకేష్‌ కోవిడ్‌ భయంతో హైదరాబాద్‌ లో దాక్కున్నారు. బుర్రలేని నాయకుడుగా ప్రజల్లో గుర్తింపు వున్న లోకేష్‌ ఈ రాష్ట్ర సీఎం గురించి తన స్థాయిని మించి మాట్లాడుతన్నాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తన మాటలకు పెద్ద ఎత్తున ప్రచారం ఇస్తాయనే ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నాడు.

– ఇంటర్, పదోతరగతి పరీక్షలు ఎందుకు పెడుతున్నారని లోకేష్‌ ప్రశ్నిస్తున్నాడు. విద్యార్ధుల కెరీర్‌లో కీలకమైన ఇంటర్, పదో తరగతి పరీక్షల మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. ప్రజలతో పాటు విద్యార్ధుల భద్రత మీద ఈ ప్రభుత్వానికి బాధ్యత వుంది. ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో లోకేష్‌ చెబితే తెలుసుకునే పరిస్థితిలో మేం లేము. విద్యార్ధులకు కీలకమైన పరీక్షలను అన్ని జాగ్రత్తలతో నడిపి, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దానిని కూడా రాజకీయంగా లోకేష్‌ మార్చేస్తున్నాడు.