విధాత: జగన్‌రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యాచార ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. రెండున్నరేళ్లకి దగ్గరపడుతున్న పాలనలో ఇప్పటివరకూ 500 మందికి పైగా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగాయి. ఒక్క కేసులోనూ నిందితులకు శిక్షపడలేదు. ఒక్క బాధిత ఆడబిడ్డకీ న్యాయం జరగలేదు. మహిళలకు భద్రత, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహించింది. ప్రభుత్వానికి లేఖలు రాసింది. అసెంబ్లీ, శాసనమండలిలో నినదించింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందనలేదు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్పించి..కార్యాచరణ లేకపోవడంతో ..రోజుకొక అఘాయిత్యం జరుగుతోంది. ఇటీవల గుంటూరులో రమ్య అనే బీటెక్ విద్యార్థిని ఓ ఉన్మాది పట్టపగలే నడిరోడ్డుపై పొడిచి చంపేశాడు. రమ్య కుటుంబాన్ని పరామర్శించి.. న్యాయం చేయాలని డిమాండ్ చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని..టిడిపి సీనియర్ నేతల్ని అక్రమంగా అరెస్టు చేసి అన్యాయంగా వ్యవహరించింది ప్రభుత్వం. అయితే పట్టువదలని ఉద్యమకారుడిలా నారా లోకేష్ రమ్య కుటుంబానికి న్యాయం జరిగేవరకూ, మరో ఆడబిడ్డ అన్యాయం జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని వివిధ రూపాలలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రమ్య మృతిచెందిన రోజు నుంచీ సర్కారుకి 21 రోజులలో న్యాయం చేయకపోతే..మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో మృగాళ్లకు బలైన దిశ పేరుతో చట్టం రూపొందించి.. 7 రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో కోర్టు విచారణ, 21 రోజుల్లో ఏకంగా ఉరిశిక్ష విధించేలా దిశ చట్టం రూపొందించామని…పాలాభిషేకాలు చేయించుకున్నారు ముఖ్యమంత్రి. అయితే ఆ చట్టం అసలు కార్యరూపమే దాల్చలేదని కేంద్రం తేల్చి చెప్పేయడంతో అదో ఫేక్ సీఎం ఇస్తోన్న ఫేక్ జీవోలు, ఫేక్ హామీలు మాదిరిగానే ఫేక్ చట్టం అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికీ ఇంకా దిశచట్టం అంటూ మంత్రులు, ప్రభుత్వ పెద్దలు మాయ చేయాలని చూస్తూనే వున్నారు. దిశచట్టం తెచ్చామని వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకున్న తరువాత వందల మంది ఆడబిడ్డలు బలైయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే దళిత మహిళని అత్యాచారం చేసి చంపేశారు. సీఎం ఇంటి పక్క తాడేపల్లిలో దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే నేటికీ నిందితులను పట్టుకోలేదు. సీఎం సొంత చెల్లెలు వైఎస్ సునీతారెడ్డి తనకు పులివెందులలో రక్షణలేదని పోలీసులను ఆశ్రయించడంతో ..ఈ సీఎం పాలనలో సొంత చెల్లెళ్లకే రక్షణలేనప్పుడు..ఇతరుల ఆడపిల్లలకు ఇంకెలా రక్షణ దొరుకుతుందని ప్రశ్న అన్నివర్గాల నుంచీ వస్తోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ..రమ్యలాంటి ఘటన మరొక ఆడపిల్లకి జరగకూడదని, నాగమ్మలా మరొకరు బలి కాకూదని, తేజస్విని కుటుంబానికి కలిగిన గుండెకోత ఇంకొకరికి కలగకూడదని ..ఆడపిల్లల రక్షణ కోసం ఓ మహోద్యమానికి సిద్ధమయ్యారు. తాను ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్‌లోగా అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించాలని ..లేదంటే ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ,ఐటీడీపీ వేదికలుగా ఆడపిల్లలకు జరిగిన అన్యాయాలను వెలుగులోకి తెస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వుంటారు. మహిళల భద్రతకి ఏం చర్యలు తీసుకున్నారని నిలదీస్తూనే పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీ అనుబంధం విభాగాలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకూ మహిళలకు భద్రత కల్పించాలని, ఆడపిల్లల రక్షించలేని ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని డిమాండ్ చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎవరైనా రేప్ కి గురైనా, దాడికి గురైనా ప్రాణాలకు వెలకట్టడం మానుకోవాలని హెచ్చరించనున్నారు. కనీసం పరామర్శించాలనే మానవత్వంలేని ముఖ్యమంత్రి… ఇచ్చే పరిహారంతో పోయిన ప్రాణాల్ని తిరిగి తీసుకురాగలరా? అని ప్రశ్నించనున్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, మరో ఆడపిల్ల బలి కాకూడని నినదిస్తూ.. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వమించనున్నారు. బాధిత కుటుంబాలను కలిసి భరోసా ఇవ్వనున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల్ని చైతన్యం చేసేందుకు ..ఆడపిల్లల భద్రతపై సూచనలు చేస్తూ..మన పిల్లల్ని మనమే రక్షించుకుందాం అని పిలుపునిస్తున్నారు. ఆడపిల్లల మానప్రాణాలు రక్షించే బాధ్యతల్ని గాలికొదిలి పారిపోతున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని, భద్రత మన హక్కు అని చాటిచెప్పనున్నారు. సోషల్‌మీడియాలోనూ రోజూ సర్కారు బాధ్యతని గుర్తుచేస్తూ నారా లోకేష్ కౌంట్ డౌన్ అలెర్ట్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ న్యాయం జరగని కుటుంబాల ఆవేదనని వెలుగులోకి తెస్తూ..ఇంకెప్పుడు సీఎం న్యాయం చేస్తారని నిలదీస్తున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూనే, వారి న్యాయపోరాటానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఉన్మాదుల వేటుకి బలైన కుటుంబాలను నేరుగా కలిసి..పరామర్శించి..వారికి అండగా నిలవనున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.