విశాఖలో వ్యక్తి కిడ్నాప్

అమరావతి :విశాఖలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతోంది. వినోద్ అనే వ్యక్తిని అతని స్నేహితులు నలుగురు కారులో ఎక్కించుకుని నగరమంతా పలు ప్రాంతాల్లో తిప్పుతూ డబ్బులు కోసం ఒత్తిడి చేసి గాయపరిచారు.రూ.78 వేల అప్పుకు వడ్డీతో సహా 9 లక్షల లాగేందుకు సదరు వ్యక్తి స్నేహితులే ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు,కిడ్నాప్‌నకు స్నేహితుల మధ్య నగదు లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. ఏటిఎంలో డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కిడ్నాపర్ల నుంచి వినోద్ తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు […]

  • Publish Date - June 23, 2021 / 04:01 AM IST

అమరావతి :విశాఖలో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతోంది. వినోద్ అనే వ్యక్తిని అతని స్నేహితులు నలుగురు కారులో ఎక్కించుకుని నగరమంతా పలు ప్రాంతాల్లో తిప్పుతూ డబ్బులు కోసం ఒత్తిడి చేసి గాయపరిచారు.
రూ.78 వేల అప్పుకు వడ్డీతో సహా 9 లక్షల లాగేందుకు సదరు వ్యక్తి స్నేహితులే ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు,కిడ్నాప్‌నకు స్నేహితుల మధ్య నగదు లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. ఏటిఎంలో డబ్బులు తీసి ఇస్తానని చెప్పి కిడ్నాపర్ల నుంచి వినోద్ తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్ల నుంచి కారు, రెండు లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Readmore:ఆ ఘటన నా మనసును చాలా కలచివేసింది: జగన్