అమరావతి: ఇండియన్ పోర్టుల ముసాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ముసాయిదా వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. మైనర్ పోర్టులపై నియంత్రణ కేంద్రానికి వెళ్లడం సరికాదని పేర్కొన్నారు. అధ్యయనానికి కేంద్రాన్ని మరికొంత సమయం ఇవ్వాలని కోరామని వెల్లడించారు.
అధ్యయనం కోసం నిపుణుల కమిటీని నియమిస్తామని తెలిపారు. అవసరమైతే తీరప్రాంత రాష్ట్రాల మద్దతు తీసుకుని పోరాటం చేస్తామని చెప్పారు. మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులు నవంబర్‌లో ప్రారంభిస్తామని గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
Readmore:ఐటీ కేంద్రంగా విశాఖ: జగన్
(ఎంఎస్‌డీసీ) వర్చువల్ సమావేశం ప్రారంభం