నాడు-నేడు పనులు, విద్యా కానుక కిట్లు ప‌రిశీలించిన మంత్రి వేణుగోపాలకృష్ణ

విధాత‌: రామచంద్రాపురం పట్టణంలోని చాకలిపేట హైస్కూల్ ను సందర్శించిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నాడు-నేడు పనులు, విద్యా కానుక కిట్లు పంపిణీని పరిశీలించారు.జగనన్న గోరుముద్ద ద్వారా అందిస్తున్న భోజన సదుపాయాలను అకస్మిక తనీఖీ చేశారు.విద్యార్థులతో క‌లిసి ఆయ‌న భోజ‌నం చేశారు.జగనన్న గోరు ముద్ద ద్వారా అందిస్తున్న భోజనం ‌మా ఇంటి భోజనం కన్న గొప్పగా ఉందని విద్యార్థులు చెప్పుతుంటే చాలా సంతోషం కలిగించింది. బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మ గాంధీ ఆశయం ఒక్కటే […]

  • Publish Date - September 8, 2021 / 09:23 AM IST

విధాత‌: రామచంద్రాపురం పట్టణంలోని చాకలిపేట హైస్కూల్ ను సందర్శించిన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నాడు-నేడు పనులు, విద్యా కానుక కిట్లు పంపిణీని పరిశీలించారు.జగనన్న గోరుముద్ద ద్వారా అందిస్తున్న భోజన సదుపాయాలను అకస్మిక తనీఖీ చేశారు.విద్యార్థులతో క‌లిసి ఆయ‌న భోజ‌నం చేశారు.జగనన్న గోరు ముద్ద ద్వారా అందిస్తున్న భోజనం ‌మా ఇంటి భోజనం కన్న గొప్పగా ఉందని విద్యార్థులు చెప్పుతుంటే చాలా సంతోషం కలిగించింది.

బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మ గాంధీ ఆశయం ఒక్కటే విద్యతో పేదరిక నిర్మూలన అవుతుంది,ఆ ఆశయ సాధన దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు నిదర్శనం.ఎదో ఒక్క సమస్య సృష్టించి ఆ సమస్యతో ప్రజలు మభ్యపెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి.రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.

మీకు అధికారం ఇస్తే ఏమి చేసారు?

మీకు అధికారం పోయిందని ఆ అధికారం కోసం సంక్షేమ పాలకుడు పాలనను ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.అధికారమే మీ లక్ష్యం… పేదవాడి అభివృద్ధి సీఎం లక్ష్యం,గత ప్రభుత్వం నాణ్యత లోపంతోనే నేడు రోడ్లకు ఈ పరిస్థితి.3 సంవత్సరాలలో మీరు నిర్మించిన రోడ్లు నాణ్యత లోపంతో గుంతలు ఏర్పడ్డాయి,మీ నాణ్యత లోపంతో ఏర్పడిన గుంతలను బాగు చేసి మంచి రోడ్లను ఏర్పాటు చేసేందుకు రోడ్డు మ్యాప్ సీఎం సిద్దం చేశారు.మీరు చేసిన అవకతవకలు వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దాదాపుగా 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి రోడ్లను మరమ్మత్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Latest News