విధాత: నగరి 100 బెడ్ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ హాస్పిటల్ పరిస్థితి గతంలో పోల్చుకుంటే చాలా మెరుగుపడిందని దానికి కారణం నాడు-నేడు ద్వారా 5.00 కోట్ల రూపాయలు మన ప్రియతమ ముఖ్యమంత్రి మంజూరు చేయడం ప్రధానమని తెలిపారు అదేవిధంగా ఈ ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ రావడం, మెడికల్ కాలేజ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను హాస్పిటల్ విధులకు కేటాయించడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
మరియు హాస్పిటల్ అభివృద్ధికి కావలసిన సౌకర్యాలను మెరుగు పరచడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో హాస్పిటల్ కమిటీ నెంబర్లు డాక్టర్లు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ లు, మండల పరిషత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.