మండలి ఛైర్మన్‌గా మోసేను రాజు? వైకాపా వర్గాల్లో చర్చ

  • Publish Date - June 16, 2021 / 05:53 AM IST
 విధాత:అమరావతి: శాసన మండలి నూతన ఛైర్మన్‌గా మోసేను రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు వైకాపా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా ఆయన నియామకానికి సోమవారం గవర్నరు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.మండలి ఛైర్మన్‌,డిప్యూటీ ఛైర్మన్‌ పదవుల్లో ఒకటి ఎస్సీకి, రెండోది బీసీ లేదా మైనారిటీ వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదనపై వైకాపా అధినాయకత్వం చర్చిస్తోంది. 
ఎంఏ షరీఫ్‌ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో మైనారిటీ నుంచే కొత్తవారు వస్తారన్న ప్రచారం గతంలో జరిగింది. కానీ..శాసనసభ సభాపతి పదవిని బీసీ వర్గానికి చెందిన తమ్మినేనికి ఇచ్చినందువల్ల మండలి ఛైర్మన్‌ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని వైకాపా ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.అందులో భాగంగానే మోసేను రాజు పేరు పరిశీలనకు వచ్చిందని వైకాపా నేత ఒకరు తెలిపారు.ఇలా చేస్తే డిప్యూటీ ఛైర్మన్‌ పదవి బీసీ లేదా మైనారిటీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.