శాసనమండలిని రద్దు చేయాలి.. ఎంపీ ఆర్ఆర్ఆర్

విధాత‌:శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.మెజార్టీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారన్నారు. మెజార్టీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజార్టీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు. మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్‌ చెప్పిన మాటలను నమ్మాలంటే.. తక్షణమే మండలిని రద్దు చేయాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ గల […]

  • Publish Date - June 21, 2021 / 04:42 AM IST

విధాత‌:శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.మెజార్టీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారన్నారు. మెజార్టీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తిందన్నారు. మండలిలో మెజార్టీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు.

మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్‌ చెప్పిన మాటలను నమ్మాలంటే.. తక్షణమే మండలిని రద్దు చేయాలని పేర్కొన్నారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానని,జగన్‌ విలాసాలకు 26 కోట్లు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని రఘురామ లేఖలో వంగ్యాస్త్రాలు సంధించారు.

Readmore:జగన్ రాముడో.. రావణుడో తేలేవరకు ఏపీలో కాలుపెట్టను: రఘురామ