విధాత: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. సాదాసీదా జీవితం గడుపుతున్నానని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి ఈరోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చినట్టు తెలిసిందని ఆయన అన్నారు. సొంత డబ్బులతో ఢిల్లీకి ప్రత్యేక విమానంలో రావాలంటే రూ. 15 లక్షలు ఖర్చవుతుందని… విజయసాయికి అంత డబ్బు ఎవరు కట్టారని ప్రశ్నించారు. విజయసాయికి నెలకు లక్షన్నర రూపాయల జీతం వస్తుందని… అలాంటి వ్యక్తి ప్రత్యేక విమానాల్లో ఎలా ప్రయాణించగలరని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం విజయసాయిని ప్రత్యేక విమానంలో పంపించిందా? అని అడిగారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలని చెప్పారు.
కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై రఘురాజు విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టామని విజయసాయి చెబుతున్నారని… మరి, అంత భారీ ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టినప్పుడు జాబితాలో ఏపీ ఆఖరి స్థానంలో ఎందుకుందని ఎద్దేవా చేశారు.
లక్షన్నర జీతం వచ్చే విజయసాయిరెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఎలా వచ్చారు..?
<p>విధాత: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. సాదాసీదా జీవితం గడుపుతున్నానని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి ఈరోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చినట్టు తెలిసిందని ఆయన అన్నారు. సొంత డబ్బులతో ఢిల్లీకి ప్రత్యేక విమానంలో రావాలంటే రూ. 15 లక్షలు ఖర్చవుతుందని… విజయసాయికి అంత డబ్బు ఎవరు కట్టారని ప్రశ్నించారు. విజయసాయికి నెలకు లక్షన్నర రూపాయల జీతం వస్తుందని… అలాంటి వ్యక్తి ప్రత్యేక విమానాల్లో ఎలా ప్రయాణించగలరని ప్రశ్నించారు. […]</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి