న్యాయందే అంతిమ విజ‌యం నారా లోకేష్

విధాత‌:మాన్సాస్ ట్ర‌స్ట్‌ని చెర‌బ‌ట్టేందుకు ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోల‌ను హైకోర్టు కొట్టివేయ‌డంతో ధ‌ర్మం, చ‌ట్టం, న్యాయందే అంతిమ విజ‌యం అని తేలింది. ఈ తీర్పు అప్ర‌జాస్వామికంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధ‌రాత్రి చీక‌టి జీవోలు జారీచేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకి చెంప‌పెట్టు. భూములు, వేల కోట్ల ఆస్తులు ప్ర‌జ‌ల కోసం దాన‌మిచ్చిన పూస‌పాటి వంశీకుల దాన‌గుణానికి, స‌త్య‌నిష్ట‌కి న్యాయ‌స్థానం తీర్పు మ‌రింత వ‌న్నెతెచ్చింది. అరాచ‌క ప్ర‌భుత్వ పాల‌న‌పై సింహాచ‌లం అప్ప‌న్న ఆశీస్సులు, ప్ర‌జాభిమానం, చ‌ట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజ‌యం ఇది. […]

  • Publish Date - June 14, 2021 / 08:49 AM IST

విధాత‌:మాన్సాస్ ట్ర‌స్ట్‌ని చెర‌బ‌ట్టేందుకు ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోల‌ను హైకోర్టు కొట్టివేయ‌డంతో ధ‌ర్మం, చ‌ట్టం, న్యాయందే అంతిమ విజ‌యం అని తేలింది. ఈ తీర్పు అప్ర‌జాస్వామికంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అర్ధ‌రాత్రి చీక‌టి జీవోలు జారీచేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకి చెంప‌పెట్టు. భూములు, వేల కోట్ల ఆస్తులు ప్ర‌జ‌ల కోసం దాన‌మిచ్చిన పూస‌పాటి వంశీకుల దాన‌గుణానికి, స‌త్య‌నిష్ట‌కి న్యాయ‌స్థానం తీర్పు మ‌రింత వ‌న్నెతెచ్చింది. అరాచ‌క ప్ర‌భుత్వ పాల‌న‌పై సింహాచ‌లం అప్ప‌న్న ఆశీస్సులు, ప్ర‌జాభిమానం, చ‌ట్టం, న్యాయం, రాజ్యాంగం సాధించిన విజ‌యం ఇది. న్యాయ‌పోరాటం సాధించిన పెద్ద‌లు అశోక్‌గ‌జ‌ప‌తిరాజు గారికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.