విధాత:గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గరలోనే ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియా చేస్తున్న అరాచకాలు, దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టి జైలుకు పంపిస్తామన్నారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న జగన్ బంధువర్గానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో షాక్ తగిలిందని, వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. మైనింగ్ పేరుతో జరుగుతున్న దందా ఒక్కొక్కటీ బయటకు వస్తోందని, మాఫియా పునాదులు కదులుతున్నాయని లోకేష్ అన్నారు. బాక్సైట్ కోసం తప్పుల మీద తప్పులు చేస్తున్న జగన్ అండ్ కో, వారి అక్రమ మైనింగ్‌కు సహకరించిన అధికారులు చిప్పకూడు తినడం ఖాయమని లోకేష్ హెచ్చరించారు.