విధాత: అందరూ శాంతి, సౌభ్రాతృత్వంతో కలిసి,మెలిసి ఉండాలంటే మనం మంచిగా ఉంటే సరిపోదు. చెడును ప్రతిఘటించాలి. పోరాడాలి. దుష్టులపై విజయం సాధించినప్పుడే అందరికీ సుఖశాంతులు అందుతాయి. అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ మనకు అందించిన సందేశం ఇదే.
దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దేవీ అనుగ్రహం వలన మీ ఇంటిల్లిపాదికీ శాంతి సౌభాగ్యాలు, సకల విజయాలు సమకూరాలని కోరుకుంటున్నానాని తెలిపారు నారా లోకేష్.