విధాత: ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన పట్టాభినే అరెస్ట్ చేశారంటే.. వీళ్లు ప్రజల కోసం పనిచేసే పోలీసులు కాదని తేలిపోయింది. ఏపీలో ప్రజలకీ, ప్రతిపక్షనేతలకీ రక్షణ లేదు. పట్టాభికి హానితలపెట్టాలని పోలీసులు చూస్తున్నారు. పట్టాభికి ఏమైనా జరిగితే డిజిపి, ముఖ్యమంత్రిదే బాధ్యత. తక్షణమే పట్టాభిని కోర్టు ముందు హాజరుపరచాలి. బోస్‌డీకే అనేది రాజద్రోహం అయితే.. వైసీపీనేతల అసభ్య భాష ఏ ద్రోహం కిందకి వస్తుందో డిజిపి చెప్పాలి. డ్రగ్స్ గుట్టురట్టు చేస్తున్నారనే పట్టాభిని అదుపులోకి తీసుకున్నారని ప్రజలకీ అర్థమైంది. ఎన్నిదాడులుచేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా..దేశానికే ముప్పుగా పరిణమించిన వైసీపీ డ్రగ్స్ మాఫియా ఆట కట్టించేవరకూ టిడిపి పోరాటం ఆగదని పేర్కొన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.