జగన్‌రెడ్డి.. ఇప్పుడు వాళ్లకు ఏం సమాధానం చెబుతావ్‌..?

విధాత‌: 'బడి మూసేస్తావా..? శకుని మావా అంటున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతావ్‌ జగన్‌రెడ్డి' అని నారా లోకేశ్ నిలదీశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్లే తమ పాఠశాలలను మూసేస్తున్నారంటూ.. ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోను లోకేశ్​ తన ట్వీట్‌ కు జత చేశారు.'చదువులే లేకపోతే మాకు యూనిఫాం ఇస్తే ఏంటి?.. బెల్ట్‌ ఇస్తే ఏంటి?. వాటిని ఇంట్లో పూజించుకుంటామా' అంటూ ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోను తెదేపా జాతీయ ప్రధాన […]

  • Publish Date - October 26, 2021 / 08:07 AM IST

విధాత‌: ‘బడి మూసేస్తావా..? శకుని మావా అంటున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతావ్‌ జగన్‌రెడ్డి’ అని నారా లోకేశ్ నిలదీశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్లే తమ పాఠశాలలను మూసేస్తున్నారంటూ.. ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోను లోకేశ్​ తన ట్వీట్‌ కు జత చేశారు.’చదువులే లేకపోతే మాకు యూనిఫాం ఇస్తే ఏంటి?.. బెల్ట్‌ ఇస్తే ఏంటి?. వాటిని ఇంట్లో పూజించుకుంటామా’ అంటూ ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ట్వీట్‌ చేశారు.

ఎయిడెడ్‌ స్కూళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్లే తమ పాఠశాలలను మూసేస్తున్నారంటూ.. విశాఖపట్నంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు.ఈ సందర్భంగా వాళ్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఓ వీడియోను లోకేశ్​ జత చేశారు.