Site icon vidhaatha

పచ్చతోరణం కాదు.. అవినీతికి తోరణం.. అచ్చెన్నాయుడు

విధాత:పచ్చతోరణం పేరుతో జగన్ రెడ్డి వైసీపీ నేతల అవినీతికి తోరణం పరిచారు, మొక్కలు నాటుతున్నారా? మొక్కల పేరుతో డబ్బులు తింటున్నారా?2 ఏళ్లలో ఎన్ని మెక్కలు నాటారు? వాటిలో ఎన్ని మెక్కలు బ్రతికాయో ప్రజలకు లెక్కలు చెప్పాలి? ఆక్సిజన్ అందించే మొక్కల పెంపకంలోనూ అవినీతికి పాల్పడటం వైసీపీ నేతలకే చెల్లింది.అక్రమ మైనింగ్ కోసం పర్యావరణ, అటవీ చట్టాల నిభంధనలను ఉల్లఘించి చెట్లను నరుకుతూ…మరో వైపు పర్యావరణ పరిరక్షణ అంటూ మెక్కలు నాటడం పేరుతో ప్రభుత్వ నిధుల్ని వైసీపీ నేతలకు దోచిపెడుతున్నారు.

మన రాష్ట్రానికి కళారంగంలో ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగపడే తెల్ల పోనంకి చెట్ల నుంచి మడ అడవుల వరకు అన్నీ నరికేశారు.విశాఖ ఏజెన్సీ ఏరియాల్లో అక్రమ మైనింగ్ ని తరలించేందుకు వైసీపీ నేతలు 14 కిలో మీటర్ల మేర వేలాది చెట్లు నరికి అక్రమంగా రోడ్డు వేశారు. ఏం చర్యలు తీసుకున్నారు?ప్రభుత్వం నాటిన మొక్కల్నిసంరక్షిస్తూ రాష్ర్టంలో పర్యావరణాన్ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్దితో చర్యలు తీసుకోవాలి.
-టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు

Exit mobile version