విధాత:జమఖర్చుల నిర్వహణపై గవర్నర్ కలిసి ఫిర్యాదు చేసిన పిఏసి చైర్మన్.నలభైవేల కోట్లకు సరియైన లెక్కలు లేవని ఆరోపించిన పయ్యావుల కేశవ్.పక్కా ఆధారాలతో పిర్యాదు చేసి, జమ ఖర్చులపై దృష్టి పెట్టాలని, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన పిఏసి చైర్మన్.రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆరోపణ.తన ఆరోపణలకు ఆధారంగా కాగ్ లేఖలను జతచేసిన కేశవ్.గత రెండు ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరిన కేశవ్.రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా ఆర్ధిక,జమ ఖర్చుల నిర్వహణపై దృష్టిపెట్టాలని గవర్నర్ ను కోరిన కేశవ్.