విధాత: నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు,రాజ్యాంగ హక్కులను కాల రాయొద్దు.రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ,రాజకీయం నాకు సరదా కాదు నా బాధ్యత.నన్ను తిడితే భయపడతాననుకుంటున్నారా,బూతులు తిడితే తొక్కి పట్టి నార తీస్తానని ఘాటుగా స్పందించారు పవన్ కళ్యాణ్.
వైసీపీ నేతలు కులాల పేరిట రాజకీయం చేస్తున్నారు,రాష్ట్రంలో ఒక్కటైనా గుంతలు లేని రోడ్డు ఉందా..రోడ్ల విషయంలో సజ్జల వాఖ్యలు సరైనవి కావన్నారు.పుట్టపర్తిలో వేసినట్టు మిగతా ప్రాంతాలలో కూడా రోడ్లు వేయండి.ఒక కులాన్ని వర్గ శతృవుగా చూడడం దారుణం,వైసీపీ పాలనలో రెడ్లని కూడా అణచివేస్తున్నారు.వివేకా నంద రెడ్డి హత్య గురించి ఎందుకు మాట్లాడం లేదని ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.పోలీసులు కార్యకర్తలని అడ్డుకోవడం సరికాదు,ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం కాలరాయలేదని పేర్కొన్నారు.