బొమ్మ‌ల ఆకారంతో మొక్క‌లు

డివైడ‌ర్ల‌పై బొమ్మ‌ల ఆకారం మొక్క‌ల‌తో సుంద‌రీక‌ర‌ణ‌న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్… విధాత:న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఆహ్లాదం అందించే విధంగా మరియు పిల్లలను ఆకరించేలా నిర్మ‌లా కాన్వెంట్ రోడ్డులో సెంట్రల్ డివైడ‌ర్ నందు ఏర్పాటు చేస్తున్న జంతువుల బొమ్మ‌ల‌ మొక్కల ఏర్పాటు పనుల యొక్క పురోగతిని పరిశీలించిన న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి మొక్కలు నాటారు.న‌గ‌రపాల‌క సంస్థ ఉద్యాన‌వ‌న శాఖ అధ్వ‌ర్యంలో నిర్మ‌లా కాన్వెంట్ రోడ్డులో శనివారం క‌మిష‌న‌ర్ […]

  • Publish Date - June 19, 2021 / 11:18 AM IST

డివైడ‌ర్ల‌పై బొమ్మ‌ల ఆకారం మొక్క‌ల‌తో సుంద‌రీక‌ర‌ణ‌
న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్…

విధాత:న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఆహ్లాదం అందించే విధంగా మరియు పిల్లలను ఆకరించేలా నిర్మ‌లా కాన్వెంట్ రోడ్డులో సెంట్రల్ డివైడ‌ర్ నందు ఏర్పాటు చేస్తున్న జంతువుల బొమ్మ‌ల‌ మొక్కల ఏర్పాటు పనుల యొక్క పురోగతిని పరిశీలించిన న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి మొక్కలు నాటారు.
న‌గ‌రపాల‌క సంస్థ ఉద్యాన‌వ‌న శాఖ అధ్వ‌ర్యంలో నిర్మ‌లా కాన్వెంట్ రోడ్డులో శనివారం క‌మిష‌న‌ర్ చేతుల మీదుగా డివైడ‌ర్లు పై బొమ్మ‌ల ఆకారంలో మొక్క‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో నిర్మ‌లా కాన్వెంట్ రోడ్ స్కూల్ జోన్ కావ‌టంతో మొద‌టి సారిగా డివైడర్ మ‌ధ్య‌లో పచ్చదనంతో కూడి చిన్నారుల‌కు ఆకర్షించేలా ర‌కాల జంతువుల బొమ్మ‌లు ఆకారంలో మొక్క‌ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇప్ప‌టికే న‌గ‌ర పరిధిలోని పలు ప్రాంతాల్లో ప‌నికి రాని వ‌స్తువుల‌తో ప్రజలను ఆకర్షించేలా స్కార్ప్ పార్క్ లు పిల్లల అటపరికరాలతో కూడిన ప్రదేశాలు ఆకర్షనియంగా తీర్చిదిద్ది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింద‌న్నారు.
పర్యటనలో ఉద్యానశాఖాధికారి జె.జ్యోతి, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు పార్క్ సూపర్ వైజర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.