శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు విచ్చేశారు. పుట్టపర్తి విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.50 గంటలకు చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది

  • Publish Date - January 16, 2024 / 10:09 AM IST

– పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం

– లేపాక్షి ఆలయం సందర్శన

విధాత: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు విచ్చేశారు. పుట్టపర్తి విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.50 గంటలకు చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుoట శ్రీధర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, డీఐజి అమ్మి రెడ్డి, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి, పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, పార్థసారథి, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్, ఎయిర్ పోర్ట్ భద్రతా అధికారి తదితరులు ప్రధానిని కలిసి పుష్పగుచ్ఛాలను అందించి ఘన స్వాగతం పలికారు.


అక్కడి నుంచి ప్రధాని మోదీ.. ప్రసిద్ధ లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ప్రధానికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ శిల్ప కళను తిలకించిన ప్రధాని మోదీ.. శిల్ప కళా వైభవాన్ని ప్రశింసించారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం లేపాక్షి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రధాని మోదీ పాలసముద్రం బయలుదేరి వెళ్లారు. ప్రధాని పర్యటనకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.