విధాత: కడప జిల్లా రాజంపేట మండలం రామాపురం చెయ్యేరు నదిలో రెండు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు చిక్కుకుపోయాయి. దీంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రాణ భయంతో బస్సు పైకి ఎక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు.
ఐనప్పటికీ నది ప్రవాహం ఎక్కువ అవ్వడంతో బస్సు పూర్తిగా మునిగి 30 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో కండక్టర్తో సహా 3 మృతి చెందగా మిగితా ప్రయాణికుల ఆచూకీ తెలి యాల్సి ఉంది. ఇదిలా ఉండగా వరద నీటిలో మరో రెండు బస్సులు చిక్కుకున్నట్లు సమాచారం.