Sankranti Cock big Fight| సంక్రాంతి కోళ్ల పందాల బిగ్ ఫైట్ ప్రైజ్ రూ.1.53కోట్లు

సంక్రాంతి పండుగ సందర్బంగా ఏపీలో కోళ్ల పందాలు పోటాపోటీగా సాగాయి. అయితే సంక్రాంతి కోళ్ల పందాలలో బిగ్ బెట్టింగ్ ఫైట్ రూ.1.53కోట్ల ప్రైజ్ మనీతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరుగడం విశేషం.

అమరావతి : సంక్రాంతి పండుగ సందర్బంగా ఏపీలో కోళ్ల పందాలు పోటాపోటీగా సాగాయి. బరిలో పందెం పుంజులు తొడగొట్టి కాళ్లకు కత్తులు కట్టి ప్రత్యర్థి పుంజులను పడగొట్టి తమ యజమానుల పందెం కాచేందుకు ప్రాణాలొడ్డి పోరాడాయి. లక్షల మంది ప్రేక్షకులు..వేల మంది బెట్టింగ్ రాయుళ్ల సమక్షంలో కాయ్ రాజ్ కాయ్ నిర్వహలు ఏర్పాటు చేసిన బరిలో సంక్రాంతి కోళ్ల పందాలలో వందల కోట్లు చేతులు మారాయి. కోడి పందాలతో పాటు గుండాట, కోత ముక్కల గేమ్ లలో కూడా కోట్లాది రూపాయాల బెట్టింగ్ సాగింది.

అయితే సంక్రాంతి కోళ్ల పందాలలో బిగ్ బెట్టింగ్ ఫైట్ రూ.1.53కోట్ల ప్రైజ్ మనీతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరుగడం విశేషం. తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకటరామయ్య బరిలో రాజమండ్రి రమేశ్, గుడివాడ ప్రభాకర్ కోళ్ల మధ్య పోటీ జరిగింది. ప్రభాకర్ ‘సేతువ’ కోడి పుంజుపై రమేశ్ కు చెందిన ‘డేగ’ కోడి పుంజు నెగ్గడంతో అతడు రూ.1.53కోట్లు గెలుచుకున్నాడు.

అక్కడ పందుల పోటీలు వెరీ స్పెషల్

సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పందుల పోటీలు నిర్వహించారు.కోడి పందాలు, ఎడ్ల పందాల తరహాలోనే ఈ పందుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోనిజూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన పందుల పోటీలను తిలకించేందుకు జనం ఆసక్తిగా తరలివచ్చారు. ఈ పోటీలో పాల్గొన్న పందుల యజమానులకు రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10వేలు చొప్పున నగదు బహుమతులను అందజేశామని నిర్వాహకులు తెలిపారు.

 

Latest News