విధాత:విజయవాడ నగరానికి చెందిన సీనియర్ కబడ్డీ శిక్షకులు నాగేశ్వరరావు శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. నాగేశ్వరరావు శిక్షణలో ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొంతమంది క్రీడాకారులు శిక్షకులు గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లలో ఉద్యోగాలు చేస్తున్నారు.