విధాత:ఏపీలో గురువారం నుంచి అన్ని పర్యాటక ప్రదేశాలు తెరవాలని ఏపీ పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
అమరావతి సచివాలయంలో బుధవారం పర్యాటక రంగంపై మంత్రి సమీక్ష చేశారు. పర్యాటక శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయాలని, గురువారం బోటు ఆపరేటర్లతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటి చేప్పే విధంగా దేశ ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖపట్నం ఋషికొండలోని పర్యాటకశాఖ బ్లూబే హోటల్ ను 164 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
Readmore:ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి