Special Trains | వేసవి సెలవుల వేళల్లో రద్దీ.. కాచిగూడ – కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Special Trains | పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. మరికొందరు సొంత ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపికబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వివరించింది.

  • Publish Date - April 27, 2024 / 09:15 AM IST

Special Trains | పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో చాలా మంది వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. మరికొందరు సొంత ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపికబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వివరించింది. ఇప్పటికే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా కాచిగూడ – కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌ – కాచిగూడ, నాందేడ్‌ – కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌ – నాందేడ్‌, హైదరాబాద్‌ – నర్సాపూర్‌, నర్సాపూర్‌ – హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్ – సికింద్రాబాద్‌ ఈ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు తెలిపింది.

కాచిగూడ – కాకినాడ టౌన్ (07205) రైలు మే 9న రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది. కాకినాడ టౌన్‌ – కాచిగూడ (07206) రైలు మే 10న సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువ జామున 4.50 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. నాందేడ్‌ – కాకినాడ టౌన్‌ (07487) రైలు మే 13న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు కాకినాడ చేరుతుంది. కాకినాడ టౌన్‌ – నాందేడ్‌ (07488) రైలు సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్‌లో ఉంటుంది. హైదరాబాద్‌ -నర్సాపూర్‌ (07175) మే 11న రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. నర్సాపూర్‌ – హైదరాబాద్‌ (07176) రైలు 13న సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఉదయం 5 గంటలకు గమ్యస్థానం చేరుతుంది.

సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌ (07271) రైలు మే 10న రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 8 ఉదయం గంటలకు గమ్యస్థానంలో ఉంటుంది. కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ (07272) రైలు 10న అందుబాటులో ఉంటుంది. రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. కాచిగూడ-కాకినాడ టౌన్‌ -కాచిగూడ రైళ్లు మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది. నాందేడ్‌-కాకినాడ టౌన్‌ – నాందేడ్‌ రైళ్లు ముక్‌దెడ్‌, ధర్మాబాద్‌, బాసార, నిజామాబాద్‌, కామారెడ్డి, సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, రాజమండ్రి, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్ట్రేషన్లలో ఆగుతాయని వివరించింది.

Latest News