Special Train | హైదరాబాద్ : అయ్యప్ప భక్తులకు( Ayyappa Devotees ) దక్షిణ మధ్య రైల్వే( South Central Railway ) శుభవార్త వినిపించింది. శబరిమల( Sabarimala ) వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు( Special Train )ను నడిపించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి( Cherlapally ) – కొల్లాం( Kollam ) రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలు(Train No. 07113) ఈ నెల 18 నుంచి జనవరి 13వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం బయల్దేరనుంది.
ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గీర్, కృష్ణా, రాయిచూర్, గుంతకల్, తిరుపతి, ఎరోడ్, పాలక్కడ్, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కయాంకులం మీదుగా కొల్లాం రైల్వే స్టేషన్ చేరుకోనుంది.
ఇక కొల్లాం నుంచి చర్లపల్లి మధ్య కూడా నవంబర్ 20 నుంచి జనవరి 15వ తేదీ వరకు ప్రత్యేక రైలు (Train No. 07114) అందుబాటులో ఉండనుంది. ఈ ప్రత్యేక రైలు కొల్లాం నుంచి ప్రతి గురువారం చర్లపల్లికి బయల్దేరనుంది. కొల్లాం నుంచి కయాంకులం, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, పాలక్కడ్, ఎరోడ్, తిరుపతి, గుంతకల్, రాయిచూర్, కృష్ణా, యాద్గీర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్ మీదుగా చర్లపల్లి చేరుకోనుంది.
కాకినాడ టౌన్ నుంచి కొట్టాయం మధ్య కూడా ప్రత్యేక రైలు (Train No. 07109) ప్రతి సోమవారం నవంబర్ 17 నుంచి జనవరి 19 వరకు అందుబాటులో ఉండనుంది. కొట్టాయం నుంచి కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైలు (Train No. 07110) నవంబర్ 18 నుంచి జనవరి 20 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉండనుంది.
