విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,200 తగ్గి.. రూ. 1,43,400వద్ద నిలిచింది. ఈ ఏడాది జనవరి నెలలో బంగారం ధరలు చుక్కలను తాకాయి. ఏకంగా ఆల్ టైమ్ రికార్డు ధర రూ.1,85,000 చేరి సంచలనం రేపింది.
అయితే ఫిబ్రవరి నెల వచ్చేసరికి బంగారం ధరలు దిగిరావడం సాగుతుంది. మునుముందు బంగారం ధరలు మరింతగా దిగివచ్చే అవకాశాలు ఉన్నాయనే నిపుణుల అంచనాలు పసిడి ప్రియులను ఊరిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాల మధ్య బంగారం ధరలు హెచ్చు తగ్గుల ర్యాలీ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
స్థిరంగా వెండి ధర
సోమవారం వెండి ధరలు వరుసగా ఐదో రోజు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 2,80,000వద్ద నిలిచింది. జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు ధర రూ.4,25,000 నమోదు చేసిన వెండి ధరలు ఆ తర్వాత భారీ హెచ్చు తగ్గుదలకు గురవుతున్నాయి. చైనా, రష్యా, అమెరికా ఆర్థిక విధానాల మార్పుల క్రమంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
