OTT | సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలో సందడి చేసిన సూపర్ హిట్ సినిమాలు దాదాపు అన్నీ ఓటీటీల్లోకి వచ్చేశాయి. అయితే మాస్ మహారాజ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా మాత్రం ఇంకా స్ట్రీమింగ్‌కు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులు ZEE5 వద్ద ఉన్నాయని, ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇది పక్కన పెడితే, ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు నిజంగా పండుగే. సుమారు 15కు పైగా సినిమాలు, ఒరిజినల్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్ కానున్నాయి.
జియో హాట్‌స్టార్‌లో జీవీ ప్రకాష్ సినిమా
ఫిబ్రవరి 20 నుంచి Jio Hotstarలో తమిళ్ కామెడీ డ్రామా ‘లక్కీ ది సూపర్ స్టార్’ స్ట్రీమింగ్ కానుంది. జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనశ్వర రాజన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఓ కుక్కపిల్ల చుట్టూ తిరిగే వినోదాత్మక కథతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలోకి వస్తుండటం విశేషం.
ఈటీవీ విన్‌లో ‘శ్రీ చిదంబరం గారు’
ఫిబ్రవరి 19 నుంచి ETV Winలో తెలుగు చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ స్ట్రీమింగ్ కానుంది. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూసే ఓ యువకుడి భావోద్వేగ ప్రయాణమే కథాంశం.
నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ డబ్బింగ్ మూవీ
ఫిబ్రవరి 19 నుంచి Netflixలో మలయాళ చిత్రం ‘చథా పచ్చ’ స్ట్రీమింగ్ కానుంది. అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో విడుదల అవుతోంది. థియేటర్లలో విడుదలైన వారానికే ఓటీటీలోకి రావడం ప్రత్యేకత.
అదేవిధంగా నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్ వెబ్ సిరీస్‌ల వరద కూడా కొనసాగుతోంది.
‘Reality Check: Inside Next Top Model’ – ఫిబ్రవరి 16
‘Being Gordon Ramsay’ – ఫిబ్రవరి 18
‘The Night Agent Season 3’ – ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
జీ5లో సైకాలజికల్ థ్రిల్లర్ ‘రాక్షస’
ZEE5లో ఫిబ్రవరి 20 నుంచి కన్నడ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘రాక్షస’ స్ట్రీమింగ్ అవుతోంది. మలప్రభ నది పరిసరాల్లో జరిగే మిస్టరీ హత్యల చుట్టూ తిరిగే ఈ సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో విజయ్ రాఘవేంద్ర కీలక పాత్ర పోషించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లతో సస్పెన్స్‌ను పెంచేలా రూపొందించారు.
ప్రైమ్ వీడియోలో బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీ
Amazon Prime Videoలో బాలీవుడ్ చిత్రం ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ ఫిబ్రవరి 20 నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కానుంది. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీలో కొత్త అవకాశాన్ని అందుకుంటోంది.
అదే ప్లాట్‌ఫార్మ్‌లో హాలీవుడ్ రొమాంటిక్ చిత్రం ‘56 Days’, అలాగే టాక్ షో ‘Last Week Tonight with John Oliver Season 13’ కూడా ఈ వారం అందుబాటులోకి వస్తున్నాయి.
Sun NXTలో ‘అమోస్ అలెగ్జాండర్’ – ఫిబ్రవరి 20
Lionsgate Playలో ‘BAFTA Awards’ లైవ్ స్ట్రీమింగ్ – ఫిబ్రవరి 22
అలాగే ‘Heated Rivalry’ వంటి కంటెంట్ కూడా అందుబాటులోకి రానుంది.
మొత్తంగా చూస్తే ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ భారీగా అందనుంది. థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు, రియాలిటీ షోల నుంచి అవార్డు కార్యక్రమాల వరకు విభిన్నమైన కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవడంతో ఇంటి వద్దే సినిమాల పండుగ వాతావరణం నెలకొంది.
