విధాత:భారతీయ జనతాపార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి,ఏపీ వ్యవహారాల ఇన్చార్జి శివ్ ప్రకాష్ జీ,రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మధ్య ఢిల్లీలో మర్యాదపూర్వక సమావేశం జరిగింది. సుజనా చౌదరి నివాసంలో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిస్థితులు,రాష్ట్రంలో బిజెపి బలపడడానికి తీసుకోవలసిన చర్యలపై వీరిద్దరూ చర్చించారు.