అర్ధ సెంచరీ దాటుతున్న టమాటా ధ‌ర‌

విధాత‌: భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి, టమాటా ధరలు అర్ధ సెంచరీ దాటేశాయి. చిల్లర దుకాణాలు, మాల్స్‌లో కిలో టమాటా రూ.60 పలుకుతుండగా.. ఉల్లి రూ.50 కి చేరింది. రాష్ట్రంలోని ఆయా రైతు బజార్లలో టమాటా కిలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ.20 పైనే ఉన్నాయి. విశాఖలో బీర రూ.42, కాకర రూ.32, వంగ రూ.42 పలుకుతున్నాయి. కిలో దొండ తిరుపతిలో రూ.38, విశాఖపట్నంలో రూ.32, విజయవాడలో […]

  • Publish Date - October 18, 2021 / 10:57 AM IST

విధాత‌: భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి, టమాటా ధరలు అర్ధ సెంచరీ దాటేశాయి. చిల్లర దుకాణాలు, మాల్స్‌లో కిలో టమాటా రూ.60 పలుకుతుండగా.. ఉల్లి రూ.50 కి చేరింది. రాష్ట్రంలోని ఆయా రైతు బజార్లలో టమాటా కిలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ.20 పైనే ఉన్నాయి. విశాఖలో బీర రూ.42, కాకర రూ.32, వంగ రూ.42 పలుకుతున్నాయి. కిలో దొండ తిరుపతిలో రూ.38, విశాఖపట్నంలో రూ.32, విజయవాడలో రూ.24 చొప్పున విక్రయిస్తున్నారు. కొత్తిమీర కట్ట రూ.30 వరకు ఉంది. గత నెల 17న కిలో టమోటా రూ.13, ఉల్లి రూ.25 చొప్పున ఉండగా.. నెల తిరిగే సరికి ఇంతలా ధరలు పెరగడం గమనార్హం.