25 నుంచి టీడీపీ ‘విద్యుత్‌’ నిరసనలు

విధాత‌: పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్‌ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌తో టీడీపీ చేపట్టిన నెల రోజుల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి 29 వరకు జోనల్‌ స్థాయిలో వినూత్నంగా నిరసన తెలియజేయనుంది. ఈ నెల 1 నుంచి మొదలైన టీడీపీ ఆందోళన కార్యక్రమాల మూడోదశలో భాగంగా సోమవారం నుంచి శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు గ్రామాల్లోకి వెళుతున్నారు. ఈ నెల 23 వరకు ఒక్కో నియోజకవర్గంలో రోజుకి రెండు […]

  • Publish Date - October 19, 2021 / 06:55 AM IST

విధాత‌: పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్‌ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌తో టీడీపీ చేపట్టిన నెల రోజుల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి 29 వరకు జోనల్‌ స్థాయిలో వినూత్నంగా నిరసన తెలియజేయనుంది. ఈ నెల 1 నుంచి మొదలైన టీడీపీ ఆందోళన కార్యక్రమాల మూడోదశలో భాగంగా సోమవారం నుంచి శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు గ్రామాల్లోకి వెళుతున్నారు. ఈ నెల 23 వరకు ఒక్కో నియోజకవర్గంలో రోజుకి రెండు గ్రామాల చొప్పున ఆరు రోజుల్లో మొత్తం 12 గ్రామాల్లో పర్యటించనున్నారు. సోమవారం 364 గ్రామాలను సందర్శించారు. గ్రామ సమావేశాల్లో మాట్లాడారు. కొన్ని చోట్ల ఫ్యాన్లు చేతితో పట్టుకుని జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఫ్యాన్లు తిరగడం లేదంటూ నిరసన తెలిపారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక విద్యుత్తు బిల్లులు కట్టలేక ఇళ్లల్లో గుడ్డి దీపాలు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.