Home
»
Andhra Pradesh
»
Tdp Leader Achennaidu Says Only 3 Years Validity For Ysrcp
రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 సoవత్సరాలే వ్యాలిడిటి…అచ్చెన్నాయుడు
రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 సoవత్సరాలే వ్యాలిడిటి…అచ్చెన్నాయుడు కులం చూడం మతం చూడం అని చెప్పి ఇతర పార్టీల వారికి కనీసం త్రాగడానికి నీరివ్వడం లేదు టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ , వైసీపీ నేతలు ప్రతి రోజూ పచ్చత్తాపపడక తప్పదు ఎన్నికలకు ముందు కులం, చూడం మతం చూడం అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కర్నూలు […]
రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 సoవత్సరాలే వ్యాలిడిటి…అచ్చెన్నాయుడు
కులం చూడం మతం చూడం అని చెప్పి ఇతర పార్టీల వారికి కనీసం త్రాగడానికి నీరివ్వడం లేదు
టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ , వైసీపీ నేతలు ప్రతి రోజూ పచ్చత్తాపపడక తప్పదు
ఎన్నికలకు ముందు కులం, చూడం మతం చూడం అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండం బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపి వేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
టీడీపీకి ఓట్లు వేస్తే త్రాగడానికి నీరివ్వరా? జగన్ ముఖ్యమంత్రిగా సేవ చేయాల్సింది రాష్ట్ర ప్రజలందరికీనా? లేక వైసీపీ కార్యకర్తలకేనా? టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, టీడీపీకి ఓట్లు వేశారని నీళ్లు, ఫించన్, రేషన్ ఆపి వేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వనికి నిదర్శనం.
ముఖ్యమంత్రి జగన్ పాలన గాలికొదిలి ఓ వైపు టీడీపీకి ఓట్లేసిన వారికీ సంక్షేమ పధకాలు ఆపి వేస్తూ , మరో వైపు కోవిడ్ సమయంలో కూడా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. వివాద రహితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి పై అకారణంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వేదిస్తున్నారు. 2 ఏళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప సాధించిన ప్రగతి ఏంటి? టీడీపీ హయాంలో అభివృద్ధి లో ముందున్న ఆంద్రప్రదేశ్ ని అక్రమ కేసులు అరాచకల్లో దేశంలోనే నెం. 1 ప్లేస్ లో ఉంచి ఆంధ్ర ప్రదేశ్ ని అక్రమ అరెస్టుల ఆంద్రప్రదేశ్ గా మార్చారు.
రాజారెడ్డి రాజ్యాంగానికి మరో 3 సంవత్సరాలే వ్యాలీడిటి, ఆ తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. ఆరోజు నుంచి జగన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి రోజూ పచ్చత్తాపడాల్సి వస్తుంది.