అమరావతి: మీడియాతో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పదిహేను ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 213 ఎకరాలను, 16 వందల కోట్లు కోసం తనఖా పెడుతున్నారని ప్రభుత్వం పై మండిపడ్డారు.
పశుసంవర్ధక శాఖకు చినగదిలి ప్రాంతం భూమిలో A.P.S.D.C కి 35 ఎకరాలు బదలాయించనున్నారు.
మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయం దేవాదాయశాఖకు చెందిన టర్నర్ చౌల్ట్రీ ఆవరణలో ఉంది.
దేవాదాయశాఖ భూమిని రెవెన్యూ వర్గాలు ఏ రకంగా A.P.S.D.C కి బదలాయిస్తారో తెలియడం లేదు.ఇవి కాకుండా R&B శాఖకు చెందిన 5 వేల కోట్ల విలువైన ఆస్తులను తనఖా పెడుతున్నారు.
ఇప్పటికే విశాఖలో A2 విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు, దేవస్థానం భూములు, ప్రైవేటు భూములు కూడా ఆక్రమించుకున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ కి ఈ భూములు కట్టబెట్టి ఈ కార్పొరేషన్ ద్వారా 16 వందల కోట్ల అప్పు తీసుకోవాలంకుంటున్న ఈ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు, నాయకులు ఖండించవలసిన అవసరం ఉంది.
సీనియర్ నాయకులు, మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ “తనఖా పెడితే తప్పేముంది” అని చెప్పడం ఎంతవరకు సమంజసం.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేశారు.మచిలీపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు అమ్మేశారు.కాకినాడ SEZ(సెజ్) GMR నుండి అరబిందోకు ఇచ్చేశారు.ఈ అరబిందో ఎవరిది?…. A2 విజయసాయిరెడ్డి అల్లుడుది.మరల ఇప్పుడు గంగవరం పోర్టును అమ్మేస్తున్నారు.విశాఖపట్నంలో “బే పార్క్” మరియు కార్తీకవనం భూములు ఆక్రమించుకున్నారు.సింహాచలం భూములు, మానస ట్రస్ట్ భూములు అలాగే గవర్నమెంట్ భూములు కూడా ఆక్రమించుకున్నారు.ఇంత ఘోరంగా ప్రభుత్వ భూములు దోపిడి జరుగుతుంటే, ఇప్పటికైనా ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులు మాట్లాడకపోతే ఈ భూముల్ని ఎవరు కాపాడుతారు?…..
ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించవలసిన అవసరం ఉంది.మిగిలిన పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నారు.కనీసం YSRCP నాయకులు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఈ ప్రాంత భూముల్నికాపాడుకోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను.లేకపోతే రాబోయే తరం వారు మనల్ని క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సినదిగా కోరుచున్నాను.మీకు మీ పార్టీ అన్నా, మీ నాయకుడు అన్నా అభిమానం ఉండొచ్చు.మీ అభిమాన్ని చూపించుకోవడం కోసం మీ నాయకులకు పాలాభిషేకం చేస్తారో….. తేనాభిషేకం చేస్తారో చేసుకోండి.కానీ మన ప్రాంతం తాలూకా భూముల్ని కాపాడుకోవలసిన బాధ్యత మనకున్నదని గుర్తుంచుకోండి.
ఈ దోపిడీపై మన ప్రాంతంలో ఉన్న మేధావులు, అన్ని పార్టీల తాలూకా నాయకులు, ముఖ్యంగా YSRCP నాయకులు దీనిపై పోరాటం చేసి మన ప్రాంతంలో ఉన్న విలువైన భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను.